కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 08 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి రా. 9.51 కు తదుపరి పంచమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తర రా. 10.10 కు తదుపరి హస్త
యోగం: శివ మ. 12.39 కు తదుపరి సిద్ధ
కరణం: వణిజ ఉ. 11.19 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.14 - 11.05 కు & మ. 03.21 - 04.12 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 2.10 - 3.56 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు
👉🕉️ దూర్వాగణపతి వ్రతం, నాగ చతుర్థి 🕉️ 👈
గురుబోధ:
శ్రావణమాసం శుక్లపక్షంలో మధ్యాహ్నం వరకు చతుర్థి ఉంటే ఆ రోజున గణపతిని గరికతో పూజించాలి. ఈ వ్రతాన్ని దూర్వాగణపతి వ్రతం అంటారు. ఆలయంలో అయితే విగ్రహాలను, ఇంట్లో అయితే హరిద్రా గణపతిని, లేదా అర్క గణపతిని, లేదా శిలా విగ్రహములను పూజించాలి. ఈ వ్రతం అత్యంత శుభప్రదం. ఈరోజు చేసే గణపతిస్తోత్ర పారాయణం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా సమస్త విఘ్నాలు, పాపాలు తొలగి విశేష శుభఫలితాలు పొందుతారు.
కొందరు శ్రావణ శుక్ల చతుర్థి రోజున కూడా నాగపూజ చేస్తారు, నాగదేవతా నామాలు చదువుకుంటే చాలా మంచిది.
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
నాగదోష పరిహార స్తోత్రమ్👇
https://youtu.be/bB-00LLmyRQ?si=euxom4r7k7VoWdNZ