" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 08 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : సప్తమి ఉ. 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : అశ్విని ఉ. 07గం౹౹20ని౹౹ వరకు తదుపరి భరణి యోగం : గండ సా. 04గం౹౹42ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : బాలవ మ. 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రా. 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం : సా. 04గం౹౹48ని౹౹ నుండి 06గం౹౹23ని౹౹ వరకు అమృతకాలం : రా. 02గం౹౹17ని౹౹ నుండి 03గం౹౹51ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹44ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు గురుబోధ శ్రీ మద్ధేవీభాగవతము - నవమస్కంధం లో ఉన్న ఈ ద్వాదశ నామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. 1. ఓం జరత్కారు ప్రియాయై నమః 2. ఓం జగద్గౌర్యై నమః 3. ఓం సిద్ధయోగిన్యై నమః 4. ఓం నాగభగిన్యై నమః 5. ఓం నాగేశ్వర్యై నమః 6. ఓం విషహరాయై నమః 7. ఓం జగత్కారవే నమః 8. ఓం మనసాయై నమః 9. ఓం వైష్ణవ్యై నమః 10. ఓం శైవ్యై నమః 11. ఓం ఆస్తీకమాత్రే నమః 12. ఓం మహాజ్ఞాన యుతాయై నమః https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial