Aug 07 2025ఆగష్టు 07 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 07 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి మ.3.06 కు తదుపరి చతుర్దశి 8 మ.3.33 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాషాఢ మ.2.06 కు తదుపరి ఉత్తరాషాఢ 8 మ.3.04 కు
యోగం: విష్కంభ ఉ.6:42 కు తదుపరి ఆయుష్మాన్ 8 తె.4:08 కు
కరణం: తైతుల మ. 2.28 కు తదుపరి గరజి రా.2.24 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:14-11:05 కు, మ. 3:19-4:10 కు
వర్జ్యం: రా.10.26-12.05 కు
అమృతకాలం: ఉ.09:00 - 10:41 కు
సూర్యోదయం: ఉ. 5:44 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు

🕉️ అంగారక జయంతి🕉️

గురుబోధ:
మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణ సంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్యస్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.

https://youtu.be/Ij6aTtQF42Y?si=_IZuQd1kUYLbmTZo

expand_less