" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 07 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి ఉ. 11గం౹౹13ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : రేవతి ఉ. 08గం౹౹13ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : శూల సా. 06గం౹౹17ని౹౹ వరకు తదుపరి గంఢ కరణం : విష్టి సా. 04గం౹౹41ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మ.03గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹02ని౹౹ వరకు అమృతకాలం : ఉ 05గం౹౹55ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు & రా. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹55ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹44ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు గురుబోధ సకల దుఃఖాలను పోగొట్టేవాడు శివుడొక్కడే. కాబట్టి దుఃఖాలు కలిగినప్పుడల్లా పదేపదే శివుడిని సేవించాలి. సుఖం కావాలని కోరుకునేవారు సర్వకాల సర్వావస్థలలో శివనామస్మరణ, శివార్చన విడిచిపెట్టరాదు. పూర్తిగా మనస్సులగ్నం చేసి శివుణ్ణి స్మరించేవాడు, ఈ లోకంలో సకల సంపదలు పొందుతాడు. ఆరోగ్యం పొందుతాడు. అంతంలో ముక్తినీ పొందుతాడు. నిత్యం శివలింగాన్ని భక్తితో అర్చించే మానవుడికి ఏ పాపం అంటదు. అతడున్న స్థలమే కైలాసం అయిపోతుంది. - శ్రీ శివపురాణం.