Aug 05 2025ఆగష్టు 05 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 05 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి మ.1.19 కు తదుపరి ద్వాదశి 6 మ.2.08 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.10.42 కు తదుపరి మూల 6 మ.12.36 కు
యోగం: ఐంద్ర ఉ.7:24 కు తదుపరి వైధృతి 6 ఉ.7:17 కు
కరణం: విష్టి మ. 1.12 కు తదుపరి బవ రా.1.45 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:33-9:24 కు, మ. 11:14-11:59 కు
వర్జ్యం: రా.7.20-.9.02 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:41 కు
సూర్యాస్తమయం: సా. 6:31 కు

🕉️ శ్రావణశుక్ల ఏకాదశి, పుత్రద ఏకాదశి, అరవిందయోగి జయంతి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ 6వ తేదీ మధ్యాహ్నం లోపే చేసెయ్యాలి.

గురుబోధ:
శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. కలియుగంలో పుత్రులు కావాలనుకున్నవారు ఆచరించవలసినటువంటి ఏకాదశి ఈ పుత్రద ఏకాదశి.
ఈ రోజు పాటించవలసిన విధివిధానాలు👇
🕉️ వీలున్నంత వరకు ఈరోజు నారాయణ స్మరణ చేయాలి. అష్టాక్షరీ మంత్రోపదేశం ఉన్నవాళ్లు ఆ మంత్రాన్ని జపించాలి. వీలుంటే విష్ణు సంకీర్తన చేయాలి.
🕉️ కలియుగంలో వివిధ కారణాల వలన పూర్తిగా ఉపవాసం ఉండలేము కనుక ఒక పండు, పాలు లేదా స్వల్ప ఆహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. అన్నం మాత్రం తినకూడదు.
🕉️ఈ వ్రతం చేసి మర్నాడు ద్వాదశినాడు ఉదయాన్నే లేచి తిరిగి విఘ్ణవుని అర్చించి ద్వాదశి ఘడియలు దాటక ముందే పారణ పూర్తి చేయాలి. శక్తి కొలది దానాలు చేయడం మంచిది.
🕉️ ఏకాదశి నాడు గోవులకు ప్రదక్షిణ చేసి గోవులకు గడ్డి పెట్టాలి, గోపూజ చేయాలి.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

expand_less