కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 05 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: పాడ్యమి సా. 4.52 కు తదుపరి విదియ
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆశ్లేష మ. 3.22 కు తదుపరి మఘ
యోగం: వ్యతీపాత ఉ. 10.38 కు తదుపరి వరీయాన్
కరణం: బవ సా. 06.03 కు తదుపరి బాలవ పూర్తి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.48 - 01.39 కు & మ. 03.22 - 04.13 కు
వర్జ్యం: తె. 4.20 - 5.50 కు
అమృతకాలం: మ. 1.37 - 3.19 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
గురుబోధ:
మీ పనులు చూసుకుంటూ ఎంతో కొంత సమయం గుడులు తుడవండి, కడగండి, ఆలయాలను బాగుచేయండి. ఎప్పుడూ తరగని విశ్వాసంతో ఇలా చేస్తే జ్ఞానం, సంపదలు లభిస్తాయి. ఇందుకు ఉదాహరణే పురీ జగన్నాథ రాజవంశం. వారు ఇప్పటికీ జగన్నాథుని రథోత్సవంలో చీపురుకట్ట పుచ్చుకుని తుడుస్తారు, అందుకే వారి సంపదలు నిలిచాయి. మనసునెప్పుడూ పడుచుగా ఉంచుకుని భగవత్ సేవ చెయ్యండి, ప్రదక్షిణలు, అర్చనలు, భగవన్నామం చెయ్యండి.అత్యల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్ - మనం ధర్మమును రవ్వంత ఆచరించినా, అది మనల్ని మహాభయం నుండి రక్షిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు.