Aug 05 2023 ఆగస్టు 05 2023 favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 05 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్థి మ. 03గం౹౹11ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సుకర్మ రా. 02గం౹౹13ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  బాలవ ఉ. 09గం౹౹39ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹32ని౹౹ నుండి 07గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹45ని౹౹ నుండి 09గం౹౹17ని౹౹ వరకు 
అమృతకాలం : తె. 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹47ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు


గురుబోధ 
లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు ఎవరిని మోహంలో పెట్టాలో ఎవరిని మోహంలో పెట్టకూడదో చెప్తాడు.
1. ఎవడు జ్ఞానయోగంలో ఎప్పుడూ ఉంటాడో, ఇంద్రియనిగ్రహం కలిగి ఉంటాడో, బ్రహ్మనిష్ఠతో ఉంటాడో, పండితులను పూజిస్తాడో, కోపం లేకుండా ఉంటాడో, సత్యం పలుకుతాడో, శాంతం కలిగిన ధార్మికుడో, యజ్ఞం, భాగవతాదిసప్తాహాలలో పాల్గొంటాడో, వారిని మోహం లో పడేయవద్దు.
2. వేదము, ఉపనిషత్తులు, విజ్ఞానము, పురాణాలు ఇవి నా శరీరం. ఎవరితే వీటి మీద ఆసక్తితో, వినాలనే తపనతో ఉంటారో వారిని ఐశ్వర్యరూపంతో అనుగ్రహించు, వారి కష్టాలన్నీ తొలగించు. 
3. పురాణాలను సందేహంతో సంశయంతో సగం నమ్మి, నమ్మకుండా ఎవరైతే ఉంటారో వారిని మోహం లేదా మాయలో పడవేయి. - శ్రీ కూర్మపురాణం.

expand_less