Aug 04 2026ఆగష్టు 04 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 04 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి రా.7.14 కు తదుపరి సప్తమి 5 సా.5.40 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: రేవతి రా.8.16 కు తదుపరి అశ్విని 5 రా.7.26 కు
యోగం: శూల సా.5:28 కు తదుపరి గండ 5 మ.3:00 కు
కరణం: వణిజ రా.10:03 కు తదుపరి బవ 5 రా.8:42 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.33 - 9.24 కు, రా. 11.14 - 11.59 కు
వర్జ్యం: ఉ.8.29 - 10.03 కు
అమృతకాలం: రా. 07.29 - 09.04 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.44 కు

గురుబోధ:
షష్ఠీ తిథి మంగళవారంతో కూడి వస్తే దానిని భౌమ షష్ఠి అంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి లేదా స్కంద ఆరాధనకు అత్యంత విశేషమైన రోజు. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.
ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=TmOsGcnDLMFOEnRo

సుబ్రహ్మణ్యస్వామి అవతార ఘట్టము (స్కందోత్పత్తి)👇
https://youtu.be/HzagOETvUGw?si=nBMFrXpQI3FotAsW

సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము👇
https://youtu.be/KsenuKREgzY?si=EZLWJxyefphnAFYQ

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less