Aug 04 2024ఆగష్టు 04 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య మ. 3.59 కు తదుపరి పాడ్యమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుష్యమి మ. 1.50 కు తదుపరి ఆశ్లేష
యోగం: సిద్ధి ఉ. 10.38 కు తదుపరి వ్యతీపాత
కరణం: నాగ మ. 04.42 కు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 05.05 - 05.56 కు
వర్జ్యం: తె. 3.27 - 5.09 కు
అమృతకాలం: ఉ. 9.08 - 10.48 కు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు

🕉️👉రవి పుష్యయోగం👈🕉️

గురుబోధ:
ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు పుష్యమీనక్షత్రం కలిసిరావడం వల్ల రవి పుష్యయోగం. అమావాస్య కూడా కావడం వల్ల రేపు ఏ సాధన చేసినా అధిక శుభఫలితాలు కలుగుతాయి. ఇష్టదైవప్రార్థనకు చాలా అనుకూలమైన రోజు. సంకల్పసిద్ధి కలుగుతుంది. లక్ష్మీపూజ చెయ్యడం వల్ల ఐశ్వర్యాభివృద్ది. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.

శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) 👉 - https://youtu.be/UwFKCtE_fRU?si=Py_Se0pw8ZprMCLH
శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) PDF 👇https://srivaddipartipadmakar.org/stotram/sri-mahavishnu-vedastuti-galava-muni-krutham/pcatid/108/

ఇది వేదస్తుతి. ఇది విన్నా కూడా మనమే స్వయంగా స్తుతించిన, రచించిన ఫలితం పొందుతాము. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.
expand_less