" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్టు 04 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : తదియ సా. 05గం౹౹29ని౹౹ వరకు తదుపరి చతుర్థివారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : శతభిషం మ. 12గం౹౹15ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్రయోగం : శోభన ఉ. 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి అతిగండకరణం : విష్టి మ. 12గం౹౹45ని౹౹ వరకు తదుపరి బవరాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు
వర్జ్యం : సా. 06గం౹౹14ని౹౹ నుండి 07గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹13ని౹౹ నుండి 04గం౹౹42ని౹౹ వరకు & ఉ. 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹30ని౹౹కు
👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిన సంకటహరచతుర్థీవ్రతం ఆచరిస్తారు. వినాయకుడు శీఘ్రంగా, తక్షణం కోరికలు తీరుస్తాడు. విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఉపాసించినా, పూజించినా ఆయన నామాలను తలచుకున్నా అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. విఘ్నాలు తొలగిపోతాయి. మానవులు ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం సహజమే! మంచి పనులకి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. చెడ్డపని చేసేవాడికన్నా మంచిపని చేసేవాడిని భగవంతుడు ఎక్కువగా పరీక్షిస్తాడు. మంచిపని చేసేవాడికి అడుగడుక్కీ విఘ్నాలు, కష్టాలు వస్తాయి. విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడిని భక్తితో నిత్యం పూజించండి. పూజ చేయలేకపోతే కనీసం ఆయన నామాలనైనా జపించండి, తలచుకోండి. చతుర్థీ తిథుల్లో వినాయకుణ్ణి భక్తితో పూజిస్తే వారికి ఎటువంటి విఘ్నాలు ఉండవు. అనుకున్న కోరికలు తీరుతాయి అని పార్వతీదేవి శివపురాణం గణేశఖండంలో ప్రజలకు ఉపదేశించింది. అందువల్ల కలియుగంలో ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి.