కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 03 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: నవమి ఉ.9.48 కు తదుపరి దశమి 4 ఉ.11.42 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: విశాఖ ఉ.5.56 కు తదుపరి అనూరాధ 4 ఉ.8.28 కు
యోగం: శుక్ల ఉ.6:24 కు తదుపరి బ్రహ్మ 4 ఉ.7:04 కు
కరణం: కౌలవ ఉ.8.42 కు తదుపరి తైతుల రా.10.45 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:02-5:53 కు
వర్జ్యం: ఉ.10.22-12.08 కు
అమృతకాలం: రా.09:40-11:26 కు
సూర్యోదయం: ఉ. 5:41 కు
సూర్యాస్తమయం: సా. 6:31 కు
గురుబోధ:
అందరు దేవతలు సమానమే అయినా మనకు మరింత ఇష్టమైన దేవతా స్వరూపమును ఒక్కరిని ఎంచుకుని దృఢంగా పట్టుకోవాలి. నిత్యం ఆ స్వరూపమును స్మరించుకోవాలి. ఎవరిని ఎంచుకోవాలో తెలియకపోతే గురువులను అడిగి తెలుసుకోవాలి.