" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 01 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : పూర్ణిమ రా. 12గం౹౹49ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : ఉత్తరాషాఢ సా. 05గం౹౹09ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : ప్రీతి రా. 06గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : విష్టి మ. 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రా. 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం : రా. 08గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹22ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 11గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹30ని౹౹కు గురుబోధ పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతాపూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య , సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేష పూజలు, జపములు నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచరించే అర్హత కలుగుతుందని శాస్త్రం.