April 30 2026ఏప్రిల్ 30 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 30 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి రా.8.12 కు కు తదుపరి పూర్ణిమ 1 రా.9.28 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్ర రా.1.36 కు తదుపరి స్వాతి 2 తె.3.26 కు
యోగం: సిద్ధి రా.9:13 కు తదుపరి వ్యతీపాత 1 రా.9:44 కు
కరణం: వణిజ రా.9:13 కు తదుపరి బవ 1 రా.10:53 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.07 - 10.57 కు, మ. 3.10 - 4.00 కు
వర్జ్యం: ఉ.8.41 - 10.22 కు
అమృతకాలం: రా. 07.20 - 09.04 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.32 కు

🕉️ నృసింహజయంతి, మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ జయంతి🕉️

గురుబోధ:
https://youtu.be/8oi3WWGoHHA
వైశాఖ శుక్ల చతుర్దశి శ్రీనృసింహచతుర్దశి. ఈ తిథినాడు నరసింహస్వామిని భక్తితో అర్చిస్తే ఏ విధమైన శత్రుపీడ ఉండదు. నృసింహ జయంతి రోజున ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి నాడు అందరం ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి తరిద్దాం. నరసింహస్వామి వారు అహోబలంలో తొమ్మిదిమంది నారసింహులుగా మనకు దర్శనమిస్తారు.
ఈరోజు పారాయణం చేయవలసిన నృసింహ కరావలంబ స్తోత్రం గురుదేవులు మనకి అందించిన యూట్యూబ్ లింక్👇🏻👇🏻
https://youtu.be/3erOO4Yn_Hs

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less