కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: తదియ రా.8.02 కు తదుపరి వైశాఖ శుద్ధ చతుర్థి 01 రా.6.05 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రోహిణి రా.8.23 కు తదుపరి మృగశిర 01 రా.7.11 కు
యోగం: శోభన సా.12:01 కు తదుపరి అతిగండ 01 ఉ.8:34 కు
కరణం: గరజి మ.2.12 కు తదుపరి వణిజ రా.12.43 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:48-12:38 కు
వర్జ్యం: మ.12.59-2.29 పునః రా.1.42-3.13 కు
అమృతకాలం: మ.01:25-02:51 కు
సూర్యోదయం: ఉ. 5:40 కు
సూర్యాస్తమయం: సా. 6:14 కు
🕉️ పరశురామ జయంతి, అక్షయ తృతీయ, శైవమత స్థాపకుడు శ్రీ బసవేశ్వర స్వామి జయంతి, సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవం దర్శనం, త్రేతాయుగాది, వ్యాసుడు చెప్తుండగా మహాభారతం గణేశుడు వ్రాయడం మొదలుపెట్టిన పుణ్యతిథి🕉️
గురుబోధ:
వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఈ తిథిని సౌభాగ్య తిథి అని కూడా అంటారు.
చేయవలసిన విధి విధానాలు:
1) యమధర్మరాజకృత శివకేశవాష్టోత్తర శతనామాలను చదివి శివకేశవులను పూజించాలి. అక్షయతృతీయ నాడు శాస్త్రప్రామాణికంగా బంగారం కొనడం లేదా కొనవద్దని చెప్పలేదు. దానం చేయమని, చేస్తే మంచిది అని చెప్పారు. అయితే దొంగ బంగారం లేదా మోసం చేసి సంపాదించిన బంగారం లేదా శుద్ధి చేయని బంగారంలో మాత్రమే కలి పురుషుడు ఉంటాడు. (ధర్మరాజుకి మనవడు, అంతటి గొప్ప పరీక్షిత్ మహారాజు జరాసంధుడు ధరించి విడిచిన కిరీటం ఆ రోజు ధరించడం వలననే శమీకమహర్షి మీద చచ్చిన పాముని వేసి శృంగి శాపం చేత మరణించాడు. అందుకే తప్పక బంగారం శుద్ధి చేసి ధరించాలని శాస్త్రం. కష్టపడి సంపాదించిన బంగారంలో కలిపురుషుడు ఉండడు.
2) లలితాదేవిని అష్టోత్తరశతనామాలతో పూజించాలి.
3) స్వయంపాకం దానం ఇవ్వాలి. గుమ్మడికాయ, ఆనపకాయ వంటి కూరలతో కలిపి దానం ఇవ్వటం మంచిది. బియ్యం, సువర్ణం, రజతం వంటివి శక్తికొలది దానం చేసుకుంటే, అమ్మవారు అక్షయ ఫలితం ఇస్తుంది.
4) ముత్తైదువలకు పూజ చేసి, శక్తి కొలది దానం చేయటం వలన స్త్రీ పురుషులు ఇద్దరూ సౌభాగ్యంతో ఉంటారు. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు.
5) ఈ రోజు నవగ్రహాలకు 27 కానీ, 108 కానీ, ప్రదక్షిణములు చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి.
6) గురువులను, తల్లిదండ్రులకు పూజించి ప్రదక్షిణ చేయటం మంచిది.
https://youtu.be/1MoC79bhXT0?si=2pO_X4vjHsciGhFW
PDF- https://srivaddipartipadmakar.org/stotram/sri-sivakesava-ashtothara-shatanamavali-yamadharmaraja-kritham/pcatid/108/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial