కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా.10.39 కు తదుపరి తదియ 30 రా.8.02 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: కృత్తిక రా.10.12 కు తదుపరి రోహిణి 30 రా.8.23 కు
యోగం: సౌభాగ్య సా.3:53 కు తదుపరి శోభన 30 సా.12:01 కు
కరణం: బాలవ ఉ.7.19 కు తదుపరి కౌలవ సా.5:31 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:26-9:16 కు, మ. 11:04-11:50 కు
వర్జ్యం: ఉ.11.00-12.30 కు
అమృతకాలం: సా. 04:40 - 06:04 కు
సూర్యోదయం: ఉ. 5:40 కు
సూర్యాస్తమయం: సా. 6:14 కు
🕉️ త్రిపుష్కర యోగము 🕉️
గురుబోధ:
బలవంతమైన ఇంద్రియాలు మనస్సును రకరకాల భ్రమలకు గురి చేసి జీవులను మోహితులను చేసి అనేక జన్మలు ఎత్తేలా చేస్తుంటాయి. రకరకాల ప్రవర్తనలకు గుణాలే కారణం. తన పనిని పూర్తి చేసుకోవాలని భావించే మనిషి ముందుగా అసత్యం ఆడడం మొదలుపెడతాడు. క్రమంగా విషయలాలసుడు అవుతాడు అనగా ఇంద్రియసుఖాలకు బానిసవుతాడు. ఒకవేళ సుఖాలు దక్కకపోతే మోసాలు చేయడం మొదలుపెడతాడు. మోసాలు చేయడంతో ఘోరపాపాలు మూటకట్టుకుంటాడు. అందుకే ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతానుగ్రహం పొందాలి. సాధనలో పురాణశ్రవణం, మంత్రజపం, నామజపం, భజన, భగవత్ పూజ, పారాయణం లేదా భగవత్ సేవ మొ౹౹ ఉత్తమమైనవి. - శ్రీ మద్ధేవీభాగవతము.