కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి 30 తె 4.24 కు తదుపరి సప్తమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా 2.24 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: సిద్ధ రా. 12.26 కు తదుపరి సాధ్య
కరణం: తైతుల ఉ. 07.57 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.39 - 01.30 కు & మ. 03.12 - 04.03 కు
వర్జ్యం: మ. 12.14 - 1.49 కు
అమృతకాలం: రా. 9.44 - 11.18 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.36 కు
గురుబోధ:
శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. శివ కేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెబుతున్నాయి.