April 29 2023ఏప్రిల్ 29 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము

తిథి : నవమి సా. 05గం౹౹01ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : ఆశ్లేష ఉ. 11గం౹౹48ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : గండ ఉ. 09గం౹౹02ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  కౌలవ సా. 04గం౹౹52ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹39ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹04ని౹౹ నుండి 02గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹01ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు

🕉️వైశాఖ శుక్ల నవమి🕉️

గురుబోధ
ఎన్నో జన్మల సంస్కారము, పుణ్యఫలం ఉంటే కానీ సద్గురువుల ఆశ్రయం పొందలేము. ఒకవేళ పొందినా దైవానుగ్రహం లేకపోతే  నిలబెట్టుకోలేము. కొందరు తమ పాపం పెరిగి గురువులను అనుమానించడం, అవమానపరచడం చేసి భ్రష్టులవుతారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ తన గురువైన శ్రీ సమర్థ రామదాసు గారి దర్శనం కోసం, మంత్రోపదేశం తీసుకోవడం కోసం  ఎన్నోసార్లు  ప్రయత్నించారు.  కానీ వారి దర్శనం దొరకలేదు. సమర్థులు ఎంతో పరీక్షించారు. అయినా నిరాశ చెందకుండా శివాజీమహరాజ్ మొండిగా ప్రయత్నించి చివరికి వైశాఖ శుక్ల నవమి నాడు దర్శనం చేసుకుని మంత్రోపదేశం తీసుకున్నారు. వారి ఇరువురి కలయిక వల్లనే మన సనాతన ధర్మము, ఆలయాలు ఈ మాత్రం అన్నా ఉద్ధరించబడ్డాయి. అదే క్షణికోద్రేకం లేదా రాజునన్న అహంకారం శివాజీ మహరాజ్ కి ఉండి ఉంటే వారు గురువులను కలిసేవారా? ఇంతటి అఖండ భారత దేశం మనకు దక్కేదా? అందుకే శివాజీ మహారాజ్ మనకు ప్రాత:స్మరణీయుడు.  ఆధ్యాత్మికసాధనలో ఎంతో సహనం అవసరం.

expand_less