April 28 2023ఏప్రిల్ 28 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము

తిథి : అష్టమి ఉ. 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : పుష్యమి ఉ. 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : శూల ఉ. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  బవ మ. 02గం౹౹31ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹02ని౹౹ వరకు & మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : రా. 11గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు


గురుబోధ
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవపరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే  చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది. సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.

expand_less