April 27 2026ఏప్రిల్ 27 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి రా.7.59 కు తదుపరి ద్వాదశి 28 రా.7.35 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పుబ్బ రా.10.58 కు తదుపరి ఉత్తర 28 రా.11.21 కు
యోగం: వ్యాఘాత రా.9:04 కు తదుపరి హర్షణ 28 రా.8:51 కు
కరణం: విష్టి సా.6:16 కు తదుపరి బాలవ 28 సా.6:52 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 - 1.29 కు, మ. 3.09 - 4.00 కు
వర్జ్యం: ఉ.7.01 - 8.37 కు
అమృతకాలం: మ. 02.40 - 04.19 కు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు

🕉️ ఏకాదశి, అన్నవరం శ్రీసత్యదేవుని కల్యాణము, బృహస్పతి జయంతి🕉️

ఏకాదశీ ఉపవాసము ఈరోజు ఉండాలి. ద్వాదశీపారణ రేపు చేయాలి.

గురుబోధ:
- ఈరోజు శివుడిని వివిధద్రవ్యాలతో అభిషేకం చేయండి, విష్ణువునైతే గంధాలతో పూజించండి. షోడశ ఉపచారములు తప్పక చేయండి, శక్తిని అనుసరించి ఉపవాసం ఉండండి.
- ఉపవాసము ఉన్న తర్వాత దానం చేయటం మంచిది కనుక స్వయంపాకం, స్వర్ణము, వెండి, వస్త్రాలు మొదలగునవి దానం చేయటం మంచిది.
- మోహినీతిథి నాడు గురుపత్నికి గాని, అర్చకుల పత్నులకు గాని, మీ పురోహితుల భార్యలకు కానీ ఒక మంచి చీరను దానము చేస్తే మోహినీ రూపంలో ఉన్న విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less