కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: చైత్ర అమావాస్య రా.3.06 కు తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి 28 రా.12.13 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అశ్వని రా.1.31 కు తదుపరి భరణి 28 రా.11.50 కు
యోగం: ప్రీతి రా.12:19 కు తదుపరి ఆయుష్మాన్ 28 రా.8:02 కు
కరణం: చతుష్పాద మ.2.56 కు తదుపరి నాగ రా.1:01 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:50-5:41 కు
వర్జ్యం: రా.9.11-11.14 కు
అమృతకాలం: 06:20 PM నుండి 07:44 PM
సూర్యోదయం: ఉ. 5:45 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు
🕉️ చైత్ర అమావాస్య, అక్షయ అమావాస్య, పద్మకయోగం🕉️
గురుబోధ:
ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపు పచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial