కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ ఉ 6.25 కు తదుపరి తదియ
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అనూరాధ రా 2.17 కు తదుపరి జ్యేష్ఠ
యోగం: వరీయాన్ 27 తె. 04.20 కు తదుపరి పరిఘ
కరణం: గరజి ఉ. 07.45 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.25 - 09.16 కు & మ. 12.39 - 01.30 కు
వర్జ్యం: ఉ. 5.36 - 7.06 కు
అమృతకాలం: మ. 3.32 - 5.12 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
గురుబోధ:
మానవులు ఏ విధమైన జాతికి, ప్రాంతానికి చెందినవారైనా సరే ఉదయం స్నానం చేసి, తూర్పు దిక్కునకు తిరిగి, దేవపూజ చేయవలసిందే. ఉదయం నిద్రలేచే పద్ధతిని అనుసరించి, జీవులకు, ఆయువు, ద్వేషం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి, శక్తి అనేవి లభిస్తాయి. నిద్ర లేవడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఆయువు తగ్గుతుంది. ద్వేషభావన పెరుగుతుంది. మరణం దగ్గర పడుతుంది. పాపాలు పెరుగుతాయి. భాగ్యం తరుగుతుంది. వ్యాధి అధికమౌతుంది. పుష్టి, శక్తి తగ్గిపోతాయి. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయం తొందరగా నిద్రలేచేవారికి శుభపరంపరలు పెరుగుతాయి.