" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 26 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము తిథి : షష్ఠి ఉ. 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : పునర్వసు పూర్తిగా ఉంది యోగం : సుకర్మ ఉ. 06గం౹౹37ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : తైతుల ఉ. 09గం౹౹57ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹33ని౹౹ నుండి మ. 12గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : సా. 05గం౹౹27ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹10ని౹౹ నుండి 05గం౹౹41ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹41ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹14ని౹౹కు గురుబోధ ఏ దేవతా పూజ, జపము లేదా స్తోత్రపారాయణము చేస్తున్నా గణపతికి ముందు నమస్కరిస్తాము. దేవతలందరికి గణపతి అంటే అంత ప్రీతి, భక్తి. గణపతికి అంతటి ప్రాముఖ్యం, మాహాత్మ్యం కేవలం తల్లిదండ్రులని గౌరవించడం, పూజించడం వల్ల వచ్చిందని శివపురాణం చెపుతోంది. అందుకే మనం కూడా తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవిస్తే దేవతలు ప్రీతిచెందుతారు.