April 26 2022ఏప్రిల్ 26 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 26 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   చైత్రమాసం కృష్ణపక్షము

 తిథి : ఏకాదశి ఈ రోజు రాత్రి 02గం౹౹14లని౹౹ వరకు తదుపరి ద్వాదశి (27) రాత్రి 01గం౹౹10ని౹౹ వరకు 
వారం : భౌమవారము (మంగళవారం)
 నక్షత్రం : శతభిషం ఈ రోజు రాత్రి 06గం౹౹42ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
 యోగం :  బ్రహ్మ ఈ రోజు రాత్రి  07గం౹౹06ని౹౹వరకు తదుపరి ఐంద్ర 
 కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి బాలవ
 రాహుకాలం :  మధ్యాహ్నం 03 గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు 
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు
 వర్జ్యం : రాత్రి 12గం౹౹58ని౹౹ నుండి 02గం౹౹32ని౹౹ వరకు
 అమృతకాలం : ఉదయం 11గం౹౹01ని౹౹ నుండి 12గం౹౹35ని౹౹ వరకు 
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹41ని 
 సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు 

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం మంగళవారం ఉండాలి ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము బుధవారం ఉదయం చేయాలి.

గురుబోధ: 

ఇతరుల ఎంగిలి, కలుషితమైన ఆహారం, స్నానం చేయకుండా వండిన ఆహారం తినరాదు.  పూర్వం విశ్వామిత్రునికి వశిష్ఠునికి మధ్య విభేదాలు తలెత్తి,  మధ్యలో సరస్వతీ నదిని రక్తం అయి ప్రవహించమని విశ్వామిత్రుడు  శపించాల్సి వస్తుంది. రాక్షసులు ఆ నదిలోని రక్తం త్రాగుతూ ఎంతో సంతోషించారు. కానీ సంవత్సరం  తర్వాత అరుణ అనే నది సరస్వతిలో కలవడం చేత సరస్వతి మళ్ళీ దివ్యమైన నదిగా మారింది. నిరాశ చెందిన రాక్షసులకు ఎవరయితే ఎంగిలి, కలుషితపదార్థాలు, అశుచిగా వండిన తిండి, తింటారో వారి వద్ద సూక్ష్మంగా తినమని వరం లభిస్తుంది. అందుకే సాధకులు, ఆచార సంప్రదాయం పై మక్కువ ఉన్నవారు, భక్తులు అత్యవసరము అయితే తప్ప బయటపదార్థాలు తినరు. ఎంగిలి తినరు. 
- శ్రీ వామనమహాపురాణం

expand_less