April 25 2026ఏప్రిల్ 25 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 25 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: నవమి రా.10.07 కు తదుపరి దశమి 26 రా.8.50 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆశ్లేష రా.11.35 కు తదుపరి మఘ 26 రా.11.04 కు
యోగం: గండ రా.11:43 కు తదుపరి ధ్రువ 26 రా.9:35 కు
కరణం: కౌలవ సా.6:28 కు తదుపరి గరజి 26 సా.6:07 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.37 - 8.28 కు
వర్జ్యం: మ.12.48 - 2.21 కు
అమృతకాలం: సా. 6.28 - 8.03 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.30 కు

గురుబోధ:
🕉️ఎన్నో వేల జన్మల పుణ్య ఫలం, సంస్కారం ఉంటే గాని ఆలయాలను శుభ్రపరచడం, ఆలయానికి కావాల్సిన కనీస అవసరాలు తీరుద్దామని ఆలోచన రాదు. ఆలోచన వచ్చి మనం చేయాలని అనుకున్నా స్వామి అనుగ్రహం, అనుమతి, మన మీద ప్రేమ ఉంటే గాని ఆలయంలో ఉన్న దేవతామూర్తులు మనచేత సేవ చేయించుకోరు. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇంతకన్నా సులభమార్గం లేదు. కాబట్టి ఎదో ఒక ఆలయముకు మనం తరచూ సేవ చేసుకుందాం!
🕉️ఆలయాలను శుభ్రం చేస్తే రాజయోగం పడుతుంది. శారీరిక మానసిక రోగాలు కూడా తొలగుతాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less