April 25 2025ఏప్రిల్ 25 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 25 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి ఉ.10.15 కు తదుపరి త్రయోదశి 26 ఉ.7.39 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర 26 తె.4.23 కు తదుపరి రేవతి 27 తె.3.47 కు
యోగం: ఐంద్ర మ.12:30 కు తదుపరి వైధృతి 26 ఉ.8:41 కు
కరణం: తైతుల ఉ.11.45 కు తదుపరి గరజి రా.10.09 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:28-9:18 కు, మ. 12:39-1:29 కు
వర్జ్యం: మ.2.47-4.17 కు
అమృతకాలం: రా.02:08-03:34 కు
సూర్యోదయం: ఉ. 5:45 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఉ.10 గం.లోపే చేసేయాలి.

🕉️ ప్రదోషం🕉️

గురుబోధ:
ఆదివారం, శుక్రవారం, మంగళవారాలు తులసి, బిల్వపత్రాలు కోయరాదు.
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less