April 25 2024ఏప్రిల్ 25 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ పూర్తి తదుపరి తదియ
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: విశాఖ రా 1.17 కు తదుపరి అనూరాధ
యోగం: వ్యతీపాత 26 తె. 04.54 కు తదుపరి వరీయాన్
కరణం: కౌలవ ఉ. 06.45 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.07 - 10.58 కు & మ. 03.12 - 04.03 కు
వర్జ్యం: తె. 5.48 - 7.30 కు
అమృతకాలం: మ. 3.59 - 5.40 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు

🕉️ వ్యతీపాత యోగం 🕉️

గురుబోధ:
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

expand_less