April 25 2023ఏప్రిల్ 25 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 25 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము

తిథి : పంచమి ఉ. 09గం౹౹44ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : ఆరుద్ర 26వ తేదీ తె. 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి పునర్వసు  
యోగం : అతిగండ ఉ. 06గం౹౹15ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  బాలవ ఉ. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రా. 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹27ని౹౹ నుండి 07గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹14ని౹౹కు

👉🕉️ శ్రీ శంకరభగవత్పాదుల వారి జయంతి , శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి, గాయత్రీమాత అవతరణము🕉️👈

గురుబోధ
సనాతన వైదిక ధర్మమార్గాన్ని నిర్దేశించడానికి గురుస్వరూపుడిగా పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యునిగా అవతరించారు. ధర్మోద్ధరణ కొరకై అద్వైత సిద్ధాంతాలతో ఎన్నో భాష్యములు, స్తోత్రములు సరళంగా రచించారు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవింద స్తోత్రం లాంటి ఎన్నో గొప్ప స్తోత్రములను మనకు అందించారు. దేవీదేవతల మీద వారు చేసిన స్తోత్రాలు, వేద ఉపనిషత్తుల మీద భాష్యములు, ఇతర సాహిత్య గ్రంథరచనములు తెలుసుకుని అర్థం చేసుకోవడానికి జీవితకాలం కృషిచేసినా సరిపోదు. వారి జయంతి నాడు గురువులను ఈశ్వరస్వరూపంగా భావించి, త్రికరణ శుద్ధిగా పూజించి, గురుసేవ చేసుకోవడం, శ్రీ శంకరభగవత్పాదుల వారిని పూజించి వారి అష్టోత్తరశతనామావళి, కొన్ని శంకరకృత స్తోత్రములు మరియు తోటకాష్టకము భక్తి శ్రద్ధలతో పారాయణ చేయడం అత్యంత శుభప్రదం, తప్పక పఠించాలని శాస్త్రం. 
నేడే మరొక విశేషం, సాక్షాత్ ఆదిశేషుడే శ్రీ రామానుజాచార్యులుగా అవతరించారు. అటువంటి ఈ ఇద్దరు మహాత్ములు ప్రాతః స్మరణీయులు.

expand_less