కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 24 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి రా.11.45 కు తదుపరి నవమి 25 రా.10.07 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుష్యమి రా.12.29 కు తదుపరి ఆశ్లేష 25 రా.11.35 కు
యోగం: శూల రా.1:24 కు తదుపరి గండ 25 రా.11:43 కు
కరణం: బవ రా.7:22 కు తదుపరి కౌలవ 25 సా.6:28 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.28 - 9.18 కు, మ. 12.39 - 1.29 కు
వర్జ్యం: ఉ.9.16 - 10.47 కు
అమృతకాలం: మ. 02.01 - 03.34 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.30 కు
🕉️ బగళాముఖి జయంతి🕉️
గురుబోధ:
మాటవరుసకి కూడా మహాత్ములలో లోపలను ఎత్తిచూపకూడదు. మహాత్ములు చేసే పనులు లోపములుగా కనిపించినప్పటికీ అవి సరిదిద్దుకోగలిగే జ్ఞానులు వారు.
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial