కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 24 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి మ.11.59 కు తదుపరి ద్వాదశి 25 ఉ.10.15 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: శతభిషం ఉ.6.45 కు తదుపరి పూర్వాభాద్ర ఉ.5.43 తదుపరి ఉత్తరాభాద్ర తె.4.23 కు 25
యోగం: బ్రహ్మ సా.3:55 కు తదుపరి ఐంద్ర సా.12:30 కు
కరణం: బాలవ మ.2.32 కు తదుపరి కౌలవ రా.1.13 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:08-10:58 కు, మ. 3:09-3:59 కు
వర్జ్యం: మ.12.52-2.24 కు
అమృతకాలం: రా.1.32-3.00 కు
సూర్యోదయం: ఉ. 5:45 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు
🕉️ చైత్ర కృష్ణ ఏకాదశి, పాపవిమోచని🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు ఉ.10 గం.లోపే చేసేయాలి.
గురుబోధ:
ఏకాదశిని విష్ణుతిథి అని, ద్వాదశిని హరివారం అని పిలుస్తారు. ఏకాదశి అని పేరు వినగానే యమకింకరులు భయపడతారు అని పద్మపురాణం చెపుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి ఈ రోజు ఉపవాసం ఉండి, తలస్నానం చేసి శ్రీ విష్ణుసహస్రనామములు పారాయణ చేసి భక్తితో గురువును సేవిస్తే పొరపాటున కూడా యమకింకరులు దగ్గరకి రాలేరు. ఈ ఏకాదశీ వ్రతం చేయడం వలన భయంకరమైన దోషాలు కూడా నశిస్తాయి. ఈ రోజు శివునికి మరియు విష్ణువునకు అభిషేకం చేయాలి. శ్రీ సూక్తం, పురుషసూక్తంతో, తులసీదళాలతో శివకేశవులను అర్చన చేయడం చాలా మంచిది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX