" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 24 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము తిథి : చతుర్థి ఉ. 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : మృగశిర రా. 02గం౹౹22ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర యోగం : శోభన ఉ. 06గం౹౹19ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : విష్టి ఉ. 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹31ని౹౹ వరకు అమృతకాలం : సా. 05గం౹౹01ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹14ని౹౹కు గురుబోధ దేవతా కార్యక్రమాలు, మంచి పనులు శ్రద్ధతో మంచి మనసుతో చేయాలి. శ్రద్ధతో భగవత్ కథ వినేవాళ్ళు, శ్రద్ధతో అర్చన చేసేవాళ్ళు, శ్రద్ధతో దానం చేసేవాళ్ళు, శ్రద్ధతో భగవద్భజన చేసేవాళ్ళు మనసు లగ్నం చేసి చేయాలి ఇలా చేసిన పుణ్యాత్ములకు ఎప్పుడూ మంచి ఫలితములు వస్తాయి, శుభములే కలుగుతాయి. మనకి తెలియకుండానే మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. చేసే పని యందు శ్రద్ధ ఉండాలి. దేవాలయంలో ఏమేమి చేయకూడదు అంటే “వ్యర్థ వాదాః” అనవసర ప్రసంగాలు చేయకూడదు, ఏమి చేసినా శ్రద్ధతోనే చేయాలి. అలాంటి శ్రద్ధ కలిగినవారు భూలోకంలోనూ సుఖం పొందుతారు శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం పొందుతారు. మానసిక, శారీరిక, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు సుఖం పొందుతారు. మనం ఏ పని కోసమైతే వెళ్ళామో కేవలం ఆ పని పట్లే శ్రద్ధ ఉండాలి. వేరే పనులు లేక విషయాల యందు దృష్టి ఉండకూడదు. పురాణశ్రవణం చేయడానికి వెళితే కేవలం పురాణం మీదే మన దృష్టి ఉండాలి. ఆ సమయంలో ఇతర విషయాల యందు ఆసక్తి ఉండకూడదు.