"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 24 022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్రమాసం కృష్ణపక్షము
తిథి : అష్టమి ఈ రోజు ఉదయం 7గం౹౹38ని౹౹ వరకు తదుపరి నవమి రా. తె. 5గం॥ 28ని వరకు
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : శ్రవణ ఈ రోజు రాత్రి 8గం౹౹40ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : శుభ ఈ రోజు రాత్రి 11గం౹౹04ని౹౹వరకు తదుపరి శుక్ల
కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹58ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సాయంత్రం 04 గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹53ని౹౹ నుండి మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹13ని౹౹ వరకు
గురుబోధ:
నేలపై పడిన ద్రవపదార్థాలను (నూనె, నెయ్యి మొ౹౹) తీసుకుని (ఎత్తుకుని) మనం వాడకూడదని శాస్ర్తము. -- శ్రీ మద్ దేవీభాగవతము, శ్రీ మహాభారతం.