April 23 2026ఏప్రిల్ 23 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 23 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి రా.1.42 కు తదుపరి అష్టమి 24 రా.11.45 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పునర్వసు రా.1.41 కు తదుపరి పుష్యమి 24 రా.12.29 కు
యోగం: ధృతి రా.3:32 కు తదుపరి శూల 24 రా.1:24 కు
కరణం: వణిజ రా.8:49 కు తదుపరి బవ 24 రా.7:22 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.09 - 10.59 కు, మ. 3.09 - 3.59 కు
వర్జ్యం: మ.2.23 - 3.53 కు
అమృతకాలం: సా. 06.40 - 08.11 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.30 కు

🕉️ గంగామాత అవతరణము, శ్రీ భగీరథ జయంతి, వైశాఖ సప్తమి, శర్కరాసప్తమి, నర్మదానదిలో గంగామాత ప్రవేశిస్తుంది (శ్రీ స్కాందపురాణము), శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి🕉️

గురుబోధ:
👉వైశాఖశుక్లసప్తమీ తిథినాడు, జహ్నుమహర్షి గంగాదేవిని కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. ఈ రోజు నర్మదా నదిలో గంగ ప్రవేశిస్తుంది. ఈ తిథినాడు పంచదారతో చేసిన పిండివంటలు సూర్యునికి నివేదిస్తే, సకల దుఃఖాలు నశిస్తాయి. పుత్రసంతానం కలుగుతుంది.
👉ఈరోజు బాణలింగాన్ని ఆవుపాలతో అభిషేకించి, ఆ క్షీరాన్ని నెత్తిపై చల్లుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వేల జన్మల పాపాలు తొలగుతాయి.
👉ఈరోజు నర్మదా నదములో 3 కోట్ల నదులు చేరుతాయి. కావున ఈరోజు ఓంకారేశ్వరంలో ఉన్న నర్మదానదములో స్నానం చేయాలి లేదా శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి అభిషేకం చేసిన జలములు స్వీకరించినా వేల జన్మల పాపాలు పోతాయి.
👉శివ సంబంధమయిన విషయములలో చాలా పరమపవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సమానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి. నేడు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూపతటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.

నర్మదా స్తోత్రమ్👇
https://youtu.be/fnHAvqenk5U?si=0zomfyzbVfuG9yps

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less