April 23 2025ఏప్రిల్ 23 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 23 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి మ.1.36 కు తదుపరి ఏకాదశి 24 మ.11.59 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.39 కు తదుపరి శతభిషం 24 ఉ.6.45 కు
యోగం: శుక్ల సా.6:51 కు తదుపరి బ్రహ్మ 24 సా.3:55 కు
కరణం: విష్టి సా.4.43 కు తదుపరి బవ 24 తె.3.43 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:49-12:39 కు
వర్జ్యం: మ.2.34-4.06 కు
అమృతకాలం: రా.11.57-1.29 కు
సూర్యోదయం: ఉ. 5:43 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు

గురుబోధ:
నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగచేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు).

expand_less