April 23 2024ఏప్రిల్ 23 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ 24 తె 4.19 కు తదుపరి పాడ్యమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: చిత్త రా 9.52 కు తదుపరి స్వాతి
యోగం: వజ్ర 24 తె. 04.57 కు తదుపరి సిద్ధి
కరణం: విష్టి మ. 04.25 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.27 - 09.17 కు & రా. 11.06 - 11.52 కు
వర్జ్యం: తె. 3.54 - 5.38 కు
అమృతకాలం: మ. 2.52 - 4.37 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.34 కు

🕉️ హనుమద్విజయోత్సవం, చైత్రపూర్ణిమ, రౌచ్యమన్వాది, ఛత్రపతి శివాజీ మాహారాజ్ నిర్యాణం🕉️

గురుబోధ:

సదా రామ రామేతి రామామృతం తే | సదా రామమానందనిష్యందకందం ||
పిబంతం సమంతం హసంతం సుదంతం | హనూమంతం అంతర్భజే తం నితాంతం ||*

"ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింపజేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను"

శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.

https://youtu.be/kCmiAy93_Eo?si=isR_wlxN8uWb2EWZ

expand_less