April 23 2023ఏప్రిల్ 23 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము

తిథి : తదియ ఉ. 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : రోహిణి రా. 12గం౹౹53ని౹౹ వరకు తదుపరి మృగశిర  
యోగం : సౌభాగ్య ఉ. 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  గరజి ఉ. 06గం౹౹17ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹35ని౹౹ నుండి 05గం౹౹25ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹33ని౹౹ నుండి 06గం౹౹13ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹33ని౹౹ నుండి 11గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹14ని౹౹కు

👉🕉️అక్షయ తృతీయ🕉️👈

గురుబోధ

వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఈ తిథిని సౌభాగ్య తిథి అని కూడా అంటారు. 
చేయవలసిన విధివిధానాలు
 యమధర్మరాజకృత శివకేశవాష్టోత్తర శతనామాలను చదివి శివకేశవులను పూజించాలి. 
 లలితాదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. 
 స్వయంపాకం దానం ఇవ్వాలి. గుమ్మడికాయలు, ఆనపకాయ వంటి కూరలతో కలిపి దానం ఇవ్వడం మంచిది. బియ్యం, సువర్ణం, రజతం, వంటివి శక్తికొలది దానం చేసుకుంటే అమ్మవారు అక్షయ ఫలితం ఇస్తుంది. 
 ముత్తైదువలకు పూజ చేసి, శక్తి కొలది దానం చేయటం వలన స్త్రీ పురుషులు ఇద్దరూ సౌభాగ్యంతో ఉంటారు. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు.
 నవగ్రహాలకు 27 కానీ, 108 కానీ ప్రదక్షిణలు చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. 
 గురుపూజ చేసి ప్రదక్షిణ చేయటం మంచిది. 
* శాస్త్ర ప్రామాణికం ఏదీ లేనప్పటికీ, శక్తి కొలది బంగారం కొనవచ్చు. దొంగ బంగారంలో, మోసం చేసి సంపాదించిన బంగారంలో కలి పురుషుడు ఉంటాడు తప్ప కష్టపడి సంపాదించిన బంగారం లో కలిపురుషుడు ఉండడు.  


expand_less