April 22 2024ఏప్రిల్ 22 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి రా 2.42 కు తదుపరి పూర్ణిమ
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: హస్త రా. 7.34 కు తదుపరి చిత్త
యోగం: హర్షణ 23వ తేదీ తె. 04.29 కు తదుపరి వజ్ర
కరణం: గరజి మ. 02.20 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.40 - 01.31 కు & మ. 03.12 - 04.02 కు
వర్జ్యం: తె. 4.20 - 6.50 కు
అమృతకాలం: మ. 12.57 - 2.43 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.34 కు

గురుబోధ:
భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు.

శ్లో౹౹
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి

expand_less