" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము
తిథి : విదియ ఉ. 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి తదియవారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : కృత్తిక రా. 11గం౹౹55ని౹౹ వరకు తదుపరి రోహిణియోగం : ఆయుష్మాన్ ఉ. 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి సౌభాగ్యకరణం : కౌలవ ఉ. 06గం౹౹19ని౹౹ వరకు తదుపరి తైతులరాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹43ని౹౹ నుండి 07గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹40ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹43ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹13ని౹౹కు
👉🕉️శ్రీ పరశురామ జయంతి/జన్మతిథి🕉️👈
గురుబోధ
శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాలలో ఒక అద్భుతమైన అవతారం, అందునా దశావతారాలలో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్న అవతారం పరశురామావతారం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిన అపూర్వ అవతారం. రామావతారం వరకు విజృంభించి తనలో ఉన్న వైష్ణవాంశమును రామునిలో కలిపి ప్రస్తుతం మహేంద్ర పర్వతం మీద మహాతపస్సు చేసుకుంటున్న చిరజీవి పరశురాముడు. పూజ్య గురుదేవులు అందించిన మంత్రమును ఈ క్రింది వీడియో ద్వారా విని జపం చేసుకోవడం వలన ఆయువు పెరిగి, ఆరోగ్యం కలిగి ఆనందం కలుగుతుంది. ఈ రోజు తప్పనిసరిగా చేపలకు, తాబేళ్ళకు, జలజంతువులకు తమకు తోచిన ఆహారం అందిస్తే దశావతారాల యొక్క అనుగ్రహం పొంది చిరజీవులవుతారు. గురుధ్యానం చేసుకుని యథాశక్తిగా దానధర్మాలు చేసుకోగలరు.