April 21 2025ఏప్రిల్ 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి మ.3.41 కు తదుపరి నవమి 22 మ.2.52 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.8.02 కు తదుపరి శ్రవణం 22 ఉ.8.03 కు
యోగం: సాధ్య సా.11:00 కు తదుపరి శుభ 22 సా.8:13 కు
కరణం: బాలవ ఉ.7.05 కు తదుపరి కౌలవ రా.7.59 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12:39-1:29 కు, మ. 3:09-3:59 కు
వర్జ్యం: మ.12.13-1.49 కు
అమృతకాలం: ఉ.6.00 - 7.39 కు, రా.2.17 - 3.53 కు
సూర్యోదయం: ఉ. 5:44 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు

గురుబోధ:
కష్టకాలంలో అందరికీ ముందుగా గుర్తు వచ్చేది గురువు. అప్పుడు గురువును ఆశ్రయించి సేవిస్తారు. కాలక్రమేణా వారికి గురు అనుగ్రహము లభించి చనువు ఏర్పడుతుంది. గురుకటాక్షంతో అనుకున్న కోరికలు తీరి, కీర్తి లభించాక, ఇక గురువుతో తనకేమీ పనిలేదు అని భావిస్తారు, ఇదే అజ్ఞానము. చనువు పెరిగే కొలదీ అణిగిమణిగి ఉండాలి, లేదంటే భ్రష్టత్వమును పొందుతారు. శిష్యుడు ఎలా ఉండాలి అన్న దానికి ఉదాహరణ శంకరభగవత్పాదుల వారి ప్రముఖశిష్యుడైన పద్మపాదాచార్యుల వారే.

expand_less