కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 20 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: తదియ ఉ.11.05 కు తదుపరి చతుర్థి 21 ఉ.8.39 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: కృత్తిక ఉ.8.01 కు తదుపరి రోహిణి 21 ఉ.6.20 కు
యోగం: శోభన మ.12:30 కు తదుపరి అతిగండ 21 ఉ.9:08 కు
కరణం: వణిజ సా.5:49 కు తదుపరి బవ 21 మ.2:45 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.39 - 1.29 కు, మ. 3.09 - 3.59 కు
వర్జ్యం: రా.10.54 - 12.23 కు
అమృతకాలం: రా. 11.15 - 12.41 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.29 కు
🕉️ అక్షయతృతీయ, సింహాచల క్షేత్రే చందనోత్సవః, పరశురామ జయంతి, బసవ జయంతి 🕉️
గురుబోధ:
వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఈ తిథిని సౌభాగ్య తిథి అని కూడా అంటారు.
🕉️చేయవలసిన విధివిధానాలు
- యమధర్మరాజకృత శివకేశవాష్టోత్తర శతనామాలను చదివి శివకేశవులను పూజించాలి.
- అక్షయ తృతీయ నాడు శాస్త్రప్రామాణికంగా బంగారం కొనడం లేదా కొనవద్దని చెప్పలేదు. దానం చేయమని, చేస్తే మంచిది అని చెప్పారు.
- అయితే దొంగ బంగారం లేదా మోసం చేసి సంపాదించిన బంగారం లేదా శుద్ధి చేయని బంగారంలో మాత్రమే కలి పురుషుడు ఉంటాడు. (ధర్మరాజుకి మనవడు, అంతటి గొప్ప పరీక్షిత్ మహారాజు జరాసంధుడు ధరించి విడిచిన కిరీటం ఆ రోజు ధరించడం వలననే శమీకమహర్షి మీద చచ్చిన పాముని వేసి శృంగి శాపం చేత మరణించాడు. అందుకే తప్పక బంగారం శుద్ధి చేసి ధరించాలని శాస్త్రం.
- కష్టపడి సంపాదించిన బంగారంలో కలిపురుషుడు ఉండడు.
- లలితాదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి.
- స్వయంపాకం దానం ఇవ్వాలి. గుమ్మడికాయలు, ఆనపకాయ వంటి కూరలతో కలిపి దానం ఇవ్వడం మంచిది.
- బియ్యం, సువర్ణం, రజతం, వంటివి శక్తి కొలది దానం చేసుకుంటే అమ్మవారు అక్షయఫలితం ఇస్తుంది.
- ముత్తైదువలకు పూజ చేసి, శక్తి కొలది దానం చేయటం వలన స్త్రీ పురుషులు ఇద్దరూ సౌభాగ్యంతో ఉంటారు. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు.
- నవగ్రహాలకు 27 కానీ, 108 కానీ ప్రదక్షిణలు చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి.
గురువులను, తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణ చేయటం మంచిది.
శివకేశవ అష్టోత్తర శతనామస్తోత్రమ్*👇
https://youtu.be/1MoC79bhXT0?si=2pO_X4vjHsciGhFW
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-sivakesava-ashtothara-shatanamavali-yamadharmaraja-kritham/pcatid/108/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial