కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా 10.44 కు తదుపరి త్రయోదశి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుబ్బ మ. 2.26 కు తదుపరి ఉత్తర
యోగం: ధ్రువ రా. 02.48 కు తదుపరి వ్యాఘాత
కరణం: బవ ఉ. 08.23 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.57 - 07.38 కు
వర్జ్యం: రా. 10.25 - 12.11 కు
అమృతకాలం: ఉ. 7.21 - 9.07 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.34 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (శనివారం) ఉదయం చేయచ్చు.
గురుబోధ:
ఎప్పుడైనా శ్రీశైలం కానీ వేంకటాద్రికి గాని వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ నమస్కారము చేసి అనుమతి అడగాలి. తరువాత మనము ఏమి చేసినా ఆ శైలము, ఆ శైలము మీద ఉన్న దేవత మనలను అనుగ్రహిస్తారు.