" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 20 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము తిథి : అమావాస్య ఉ. 09గం౹౹46ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : అశ్విని రా. 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి భరణి యోగం : విష్కంభ ఉ. 11గం౹౹31ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : నాగ ఉ. 08గం౹౹11ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹45ని౹౹ వరకు & మ. 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు అమృతకాలం : సా. 04గం౹౹21ని౹౹ నుండి 05గం౹౹55ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹45ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹12ని౹౹కు 👉🕉️అమాగురు యోగం, పద్మకయోగం, చైత్ర అమావాస్య🕉️👈 గురుబోధ ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపు పచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి.