April 19 2026ఏప్రిల్ 19 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: విదియ మ.1.26 కు తదుపరి తదియ 20 ఉ.11.05 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: భరణి ఉ.9.35 కు తదుపరి కృత్తిక 20 ఉ.8.01 కు
యోగం: సౌభాగ్య సా.4:11 కు తదుపరి శోభన 20 మ.12:30 కు
కరణం: తైతుల రా.9:08 కు తదుపరి వణిజ 20 సా.5:49 కు
రాహుకాలం: సా. 4.30 - 6.00 కు
దుర్ముహూర్తం: సా. 4.49 - 5.39 కు
వర్జ్యం: రా.8.48 - 10.17 కు
అమృతకాలం: తె. 02.26 - 03.51 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.29 కు

గురుబోధ:
నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగచేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు).

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less