కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి మ.3.53 కు తదుపరి సప్తమి 20 సా.4.01 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మూల ఉ.6.33 కు తదుపరి పూర్వాషాఢ 20 ఉ.7.31 కు
యోగం: శివ రా.12:52 కు తదుపరి సిద్ధ 20 రా.12:12 కు
కరణం: వణిజ సా.6.22 కు తదుపరి విష్టి 20 ఉ.6.46 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:40-8:30 కు
వర్జ్యం: తె.4.50-6.32 కు, సా.4.30-6.09 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:46 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు
గురుబోధ:
సరస్వతీ జలం మూడు రోజులలో పవిత్రం చేస్తుంది. యమునా జలం ఏడు రోజులలో పవిత్రం చేస్తుంది. గంగాజలం తనలో స్నానం చేసిన వాడిని పవిత్రుని చేస్తుంది. కానీ నర్మద, దర్శన మాత్రంతో మనిషిని పవిత్రం చేస్తుంది. నర్మదా సంగమంలో (ఈ సంగమము ఓంకార క్షేత్రం దగ్గర ఉంది) స్నాన, దాన, జప, హోమ, వేదపాఠ, పితృపూజన, దేవతారాధన, మంత్రోపదేశ, సన్యాసదీక్ష చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial