కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి రా 8.44 కు తదుపరి ద్వాదశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మఘ ఉ. 11.55 కు తదుపరి పుబ్బ
యోగం: వృద్ధి రా. 01.45 కు తదుపరి ధ్రువ రా. 02.48 కు
కరణం: వణిజ ఉ. 06.46 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.29 - 09.19 కు & మ. 12.41 - 01.31 కు
వర్జ్యం: రా. 8.45 - 10.31 కు
అమృతకాలం: ఉ. 9.17 - 11.02 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
🕉️ ఏకాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణము శనివారం చేయవచ్చును.
గురుబోధ
చైత్ర శుక్లపక్ష ఏకాదశి శ్రీ శుక్రజయంతి
శుక్ర గ్రహ ధ్యాన శ్లోకం!
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అంటేనే యమకింకరులు వణికిపోతారు. ఏకాదశి నాడు : 1) ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలతో, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. 2) చామంతిపువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించినవాడు మంచిపదవిని పొందుతాడు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX