April 19 2023ఏప్రిల్ 19 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : చతుర్దశి ఉ. 11గం౹౹09ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : రేవతి రా. 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి అశ్విని  
యోగం : వైధృతి  మ. 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం :  శకుని ఉ. 09గం౹౹53ని౹౹ వరకు తదుపరి చతుష్పాద
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹34ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు  
వర్జ్యం : ఉ. 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹34ని౹౹ నుండి 11గం౹౹08ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹12ని౹౹కు

👉🕉️చైత్ర కృష్ణపక్ష చతుర్దశి, కేతు జయంతి🕉️👈

గురుబోధ 
మానవుల జీవితాలను వారి వారి కర్మఫలాలను అనుసరించి నడుపుతూ సుఖదుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధాన స్థానం. నవగ్రహాలలో ఒకరైన కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస కృష్ణపక్షచతుర్దశీ తిథి. ఈ తిథినాడు దర్భలు శిరస్సున ధరించి, నదీస్నానం చేసి కేతుతర్పణాలు ఇచ్చి, ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగిపోతాయి. ఊపిరితిత్తుల రోగాలు తత్ క్షణమే తొలగిపోతాయి.
కేతుగ్రహ ధ్యానశ్లోకం:
శ్లో|| పలాశపుష్ప సంకాశం | తారకాగ్రహమస్తకం ||
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఆ ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ బాగుంటుంది. పితృదేవతల అనుగ్రహము కలగాలంటే తప్పక చనిపోయిన తిథి నాడు  ఆబ్దికము , ప్రతి అమావాస్య , సంక్రమణ మొ౹౹ రోజులలో  తర్పణాలు, స్వయంపాకం ఇవ్వడం , పితృపక్షంలో శ్రాద్ధం పెట్టడం చేయాలి.

expand_less