April 18 2026ఏప్రిల్ 18 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 18 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: శు.పాడ్యమి మ.3.35 కు తదుపరి విదియ 19 మ.1.26 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: అశ్విని ఉ.10.57 కు తదుపరి భరణి 19 ఉ.9.35 కు
యోగం: ప్రీతి రా.11:55 కు తదుపరి సౌభాగ్య 19 సా.4:11 కు
కరణం: బవ మ.2:11 కు తదుపరి తైతుల 19 రా.9:08 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.41 - 8.31 కు
వర్జ్యం: ఉ.7.08 - 8.39 కు, రా.8.00 - 9.30 కు
అమృతకాలం: తె. 02.52 - 04.18 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.29 కు

🕉️ పరాశర మహర్షి జయంతి 🕉️

గురుబోధ:
భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు.
శ్లో౹౹ ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి
పరాశరుడు ఆంజనేయుని భక్తుడు, హనుమంతుని చరిత్రను పరాశరసంహిత అనే పేరుతో గ్రంథంగా రాసిన మహానుభావుడు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less