April 18 2023ఏప్రిల్ 18 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : త్రయోదశి మ. 12గం౹౹55ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా. 12గం౹౹44ని౹౹ వరకు తదుపరి రేవతి  
యోగం : ఐంద్ర  సా. 04గం౹౹40ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  వణిజ ఉ. 11గం౹౹57ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రా. 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు  
వర్జ్యం : ఉ. 11గం౹౹03ని౹౹ నుండి 01గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹10ని౹౹ నుండి 09గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹12ని౹౹కు

👉🕉️మాసశివరాత్రి🕉️👈
ఏమీ లేకపోయినా బిల్వపత్రాలు సమర్పిస్తే చాలు శివుడు సంతోషిస్తాడు. శివపూజకు బిల్వపత్రాల కంటే శ్రేష్ఠమైనవి మరేమీలేవు.

గురుబోధ 
సత్యవతి సాక్షాత్ వ్యాసునికి తల్లి. శంతనుడు రాజర్షి. భీష్మునికి స్వచ్ఛంద మరణం పొందమని వరం కూడా ఇచ్చిన తపః శక్తి కలవాడు. చిత్రాంగదుడు శంతనుడు, సత్యవతిల మొదటి కుమారుడు. విచిత్రవీర్యుడు ఇతని తమ్ముడు. అయినా విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు  దుర్మరణం పొందారు. దీనికి కారణం అతని తాత అయిన దాసరాజు గారి అత్యాశ, రాజ్యకాంక్ష. తన కూతరి పిల్లలకే రాజ్యం ఇవ్వాలని కోరడము. దాసరాజు దుర్మార్గపు ఆలోచనకు వారి మనవళ్ళు దుర్మరణం పొందారు. 
అందుకే ఇతరుల ఆస్తి, ఇతరుల సంపదలమీద వ్యామోహం, కష్టపడకుండా సుఖాలను పొందాలనే అత్యాశ మనలను , మన వంశాన్ని నాశనం చేస్తుంది ( శ్రీ మహాభారతం- పంచమవేదము )

expand_less