April 17 2026ఏప్రిల్ 17 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 17 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య సా.5.31 కు తదుపరి శు.పాడ్యమి 18 మ.3.35 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రేవతి మ.12.05 కు తదుపరి అశ్విని 18 ఉ.10.57 కు
యోగం: విష్కంభ తె.3:45 కు తదుపరి ప్రీతి 18 రా.11:55 కు
కరణం: నాగ సా.5:21 కు తదుపరి బవ 18 మ.2:11 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.31 - 9.21 కు, మ. 12.40 - 1.30 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 10.13 - 11.42 కు తదుపరి తె. 03.12 - 04.38 కు
సూర్యోదయం: ఉ. 6.02 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు

🕉️ అమావాస్య, శ్రీ శుకమహర్షి జయంతి 🕉️
🕉️పూజ్య గురువులు, శ్రీ ప్రణవపీఠాధీశులు ప్రవచనిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి "అభినవశుక" అనే బిరుదును 1989వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం దగ్గర అగ్రహార గోపవరంలో జరిగిన భాగవత సప్తాహ సందర్భంగా ఆనాటి ముముక్షు జన మహాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ప్రదానం చేసారు.🕉️

గురుబోధ:
ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపు పచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less