April 17 2023ఏప్రిల్ 17 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : ద్వాదశి మ. 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : శతభిషం తె. 03గం౹౹17ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర రా. 01గం౹౹56ని౹౹ వరకు  
యోగం : బ్రహ్మ  రా. 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  తైతుల మ. 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు & మ. 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు  
వర్జ్యం : ఉ. 09గం౹౹19ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : సా. 06గం౹౹23ని౹౹ నుండి 07గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹12ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు చెయ్యాలి.

గురుబోధ 
కర్మములు ప్రబలమైనవి అవి అనుభవిస్తేగాని పోవు. కొన్ని కర్మ ఫలితాలు ఎన్ని జన్మలు ఎత్తినా పోవు. కొన్ని కర్మలు ఎన్ని జన్మలు ఎత్తినా పోవు. 21 జన్మలు ఎత్తినా వదలని కర్మలు కొన్ని ఉంటాయి. అందుకే కర్మాచరణ చేసేటప్పుడు ఆచి తూచి చేయాలి. కొన్ని వేల జన్మలు ఎత్తినా వదలని కర్మ ఫలాలు, ఈ నరక వర్ణన వింటే తొలిగిపోతాయి. వినడం వల్ల కలిగే భీతితో పాపప్రక్షాళన అవుతుంది. నూనె వల్ల ఉండే జిడ్డు కూడా కొన్ని పదార్ధాలు పెట్టి రుద్దితే పోతుంది. అలాగే కర్మల వల్ల కలిగిన పాపాలు కూడా అనుభవించక తప్పదు. అనుభవించకుండా అవి తొలగాలంటే జడోపాఖ్యానంలో భాగంగా జడభరతుడు తన తండ్రికి, యమకింకరులు, విపశ్చిత్తు మహారాజుకు చెప్పిన యమకర్మ విపాకాలను వినడం ఉత్తమం. దీనికి కర్మవిపాకము అని పేరు.


expand_less