April 16 2026ఏప్రిల్ 16 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 16 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి రా.7.08 కు తదుపరి అమావాస్య 17 సా.5.31 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.12.54 కు తదుపరి రేవతి 17 మ.12.05 కు
యోగం: వైధృతి రా.7:21 కు తదుపరి విష్కంభ 18 తె.3:45 కు
కరణం: శకుని రా.8:11 కు తదుపరి నాగ 17 సా.5:21 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.11 - 11.01 కు, మ. 3.09 - 3.59 కు
వర్జ్యం: రా.12.30 - 2.02 కు
అమృతకాలం: ఉ. 09.27 - 10.58 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు

గురుబోధ:
మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, తగిన విధంగా వాటిని పరిరక్షించడం చేసేవారిని చూసి దేవతలు, పితృదేవతలు సంతోషిస్తారు. వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less